రానున్న రోజుల్లో ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం తనకు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో భాజపా కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ప్రధాని మోదీ, నడ్డా సారథ్యంలో భాజపా బలోపేతమవుతుందన్నారు. పదవుల్లో ఉన్నా.., లేకున్నా భాజపా నేతలు కుటుంబంలా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్, మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేశ్ తదితరలు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి