విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. కరోనా వైరస్ మనుషులను విడదిస్తోందని.. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోలేని విధంగా వైరస్ ఉందని.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం కేవలం పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లోనే ద్రావణాన్ని పిచికారి చేస్తుందని.. సొంత ఖర్చుతో నియోజకవర్గంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేస్తున్నట్లు గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు, మురికివాడల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా ద్రావణాన్ని పిచికారి చేశారు.
Hypocholiride spry in vijayawada east constiuency
TAGGED:
corona effect news