ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత - హైదరాబాద నేరవార్తలు

2017తో తన ప్రేయసిని కలిసేందుకు వెళ్లి పాక్​ అధికారులకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్​ ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డాడు. వాఘా సరిహద్దుల్లో భారత అధికారులకు.. పాక్ అప్పగించింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం హైదరాబాద్​కు రానున్నాడు.

ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత
ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత

By

Published : Jun 1, 2021, 12:10 PM IST

పాకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడి కథ సుఖాంతమయింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రశాంత్‌ను పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన ప్రేయసి కోసం 2017 ఏప్రిల్​లో పాక్​ వెళ్లాడు. సరిహద్దుల ద్వారా అక్రమంగా పాకిస్థాన్‌లోకి చొరబడిన ప్రశాంత్‌ను.. అక్కడి అధికారులు బంధించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే తన కుమారుడి విడుదల కోసం ప్రశాంత్​ తండ్రి బాబురావు అనేక ప్రయత్నాలు చేశారు. 2019లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి అభ్యర్థించారు. స్పందించిన సీపీ.. ప్రశాంత్‌ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనేక ప్రయత్నాల అనంతరం వాఘా సరిహద్దులో ప్రశాంత్‌ను భారత్‌కు అప్పగించారు.. పాక్ అధికారులు.

నాలుగేళ్ల తర్వాత ప్రశాంత్ భారత్‌కు చేరుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రశాంత్​ హైదరాబాద్​ రానున్నాడు.

ఇవీచూడండి:'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై.. విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details