ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​ పరువు హత్య: కీలక నిందితుల అరెస్ట్ - hyderabad hemanth murder case

హైదరాబాద్​లో శివారుల్లో జరిగిన హేమంత్‌ హత్య కేసులో పరారీలో ఉన్న కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఏడుగురిని ప్రశ్నిస్తున్నారు. వీరితో ఈ కేసులో అరెస్టైన సంఖ్య 21కి పెరిగింది.

hyderabad police catch hemanth murder case key suspects on run
హైదరాబాద్​ పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్

By

Published : Sep 28, 2020, 10:23 PM IST


తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు మరో ముగ్గురిని పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుల సంఖ్య వీరితో కలిపి 21కి పెరిగింది. ఈ కేసులో ఇప్పటికే 14మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... పరారీలో ఉన్న ఏ5 కృష్ణ, ఎ6 బాషా, ఎ17 జగన్, ఎ18 సయ్యద్‌లను పట్టుకున్నారు.

హేమంత్ భార్య అవంతి సోదరుడు అశీష్ రెడ్డి, సందీప్‌తో పాటు మరో వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎ5 కృష్ణ... ఎ1 యుగంధర్ రెడ్డితో కలిసి హత్యకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం నిందితులకు జగన్, సయ్యద్‌లు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరిని గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details