ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2022, 3:19 PM IST

Updated : Mar 28, 2022, 4:39 PM IST

ETV Bharat / city

ఈనెల 31 లోగా సీఎం జగన్​కు సమన్లు అందించండి: నాంపల్లి కోర్టు

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో.. ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. 2014లో అనుమతి లేకుండా తెలంగాణలోని హుజూర్​నగర్​లో రోడ్ షో నిర్వహించారన్న అభియోగం మేరకు జగన్‌పై అప్పట్లో కేసు నమోదైంది.

ఈనెల 31 లోగా సీఎం జగన్​కు సమన్లు అందించండి

తెలంగాణలోని హుజూర్​నగర్​లో జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసుపై.. ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. 2014లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారన్న అభియోగం మేరకు జగన్‌పై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జగన్​కు ఇంకా సమన్లు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 31లోగా జగన్​కు సమన్లు అందించాలని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న గున్నం నాగిరెడ్డి కరోనాతో మరణించినట్లు పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. నాగిరెడ్డి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడో నిందితుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం శ్రీకాంత్ రెడ్డిని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: అసెంబ్లీలో అధికార పార్టీ, భాజపా ఎమ్మెల్యేల బాహాబాహీ

Last Updated : Mar 28, 2022, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details