ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Security: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. అదనపు బలగాల పహారా - తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద అదనపు బలగాల మొహరింపు తాజా వార్తలు

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. పోలీసు అదనపు బలగాలు మొహరించాయి. పార్టీ కార్యాలయం వైపు ఎవ్వరినీ వెళ్లనివ్వకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.

huge security at DGP office and Deployment of additional forces at TDP headquarters in mangalgiri
తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద అదనపు బలగాల మొహరింపు.. ముళ్లకంచెలు ఏర్పాటు

By

Published : Oct 20, 2021, 12:02 PM IST

రాష్ట్ర డీజీపీ కార్యాలయం(DGP office) పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. పోలీసు బలగాలు అక్కడకు భారీగా చేరుకున్నాయి. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం(tdp central office) వైపు ఎవరూ వెళ్లకుండా.. రహదారిపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోగా.. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. తెదేపా శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. పోలీసు అదనపు బలగాలు భారీగా మోహరించాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details