ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో దొంగల బీభత్సం...వైద్యుడి ఇంట్లో రూ.50 లక్షల అపహరణ - robbery in vijayawada

విజయవాడ నగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వైద్యుని ఇంట్లో 50 లక్షల రూపాయల నగదు దోచేశారు. ఇంటి మెటీరియల్ కోసం వచ్చామని బాధితులను నమ్మించి ..ఇంట్లోకి వెళ్లారు. అదును చూసి వైద్యుని భార్య, కుమారుడిని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి ..కత్తులతో బెదిరించారు. ఇంట్లో నగదు తీసుకుని పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Rs 50 lakh abduction at doctor's house
విజయవాడలో దొంగల బీభత్సం

By

Published : Sep 14, 2020, 10:12 PM IST

Updated : Sep 15, 2020, 11:46 AM IST

విజయవాడ మొగల్రాజపురంలో సోమవారం భారీ దొంగతనం జరిగింది. పట్టపగలే ఓ వైద్యుని ఇంట్లోకి చొరబడి నలుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. వైద్యుడి భార్య, కుమారుడిని కాళ్లు, చేతులు కట్టేసి 50 లక్షల నగదు దోచుకెళ్లారు. జనసంచారం ఉన్న ప్రాంతంలో చోరీ జరగడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. త్వరితగతిన కేసును చేధించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..

మొగల్రాజపురం సిద్ధార్థనగర్ బ్యాంకు కాలనీ మానస అపార్ట్మెంటు ఎదురుగా ఆయుర్వేద వైద్యుడు శిరివెళ్ల మురళీధర్ నివాసముంటున్నారు. ఆ భవనం నిర్మాణంలో ఉండటంతో .. మొదటి అంతస్తులు భార్య స్వరూపరాణి , కుమారుడు సాయితేజతో కలిసి ఉంటున్నారు. రోజు మాదిరే అతను వైద్యశాలకు వెళ్లారు. సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు గేటు దూకి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపు కొట్టగా .. వైద్యుని కుమారుడు బయటకు వచ్చి ఎవరని అడగ్గా .. భవన నిర్మాణ మెటిరీయల్ కోసం వచ్చామని నమ్మబలికారు. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పేందుకు ఇంట్లోకి వెళ్లగానే .. వెనకాలే వారు ఇంట్లోకి చొరబడ్డారు. అరిస్తే చంపేస్తామంటూ కత్తులతో బెదిరించారు. ఇద్దరి చేతులను, కాళ్లను తాళ్లు, గుడ్డలతో కట్టేశారు. ఇంట్లో దాచిన 50 లక్షల రూపాయల నగదు దోచుకుపోయారు. అనంతరం నెమ్మదిగా తాళ్లను తొలగించుకున్న బాధితులు డాక్టర్ మురళీధర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే మాచవరం పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు..

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాలను పిలిపించి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన స్థలాన్ని విజయవాడ సీపి బత్తిన శ్రీనివాసులు పరిశీలించి... బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 'దొంగతనం చేసే సమయంలో మా బంధువులు మీ ఆయన దగ్గర చికిత్స నిమిత్తం చేరారు. వ్యాధి నయం కాకపోగా , అధిక ఫీజులు వసూలు చేశారు. మీ దగ్గర నుంచి అంతకంత వసూలు చేస్తాం. మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి' అంటూ మాట్లాడినట్టు బాధితులు పోలీసులకు తెలిపారు. దీంతో ఆయుర్వేద వైద్యుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు పక్కా ప్రణాళికతో చేశారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఇలు కావడంతో సీసీ కెమెరాలను బిగించలేదు. ఆ వీధిలో ఎవరూ ఏర్పాటు చేయని విషయాన్ని గుర్తించారు . ఇదే దొంగలకు కలిసి వచ్చింది. అలాగే ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించారు.

ఎవరనే కోణంలో....

అయితే బాధితుడి అంత పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడని పోలీసులు అడగ్గా .. ప్రభుత్వం మారటోరియం విధించడంతో గత ఆరునెలలుగా బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలను కట్టడం లేదని, ప్రభుత్వం రాయితీ ఇస్తే కడదామని దాచిపెట్టినట్లు వైద్యుడు తెలిపారు. ఇంట్లో అంత పెద్దమొత్తంలో నగదు ఉందని తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటు ఇల్లు నిర్మాణంలో ఉండటంతో చాలా మంది కార్మికులు వచ్చిపోతూ ఉంటారు. వీరు ఎవరైనా నగదు ఉన్న విషయాన్ని గమనించి ఉంటారా ? వీరి ద్వారా సమాచారం బయటకు వచ్చి ఉంటుందా ? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. నోటికి మాస్కులు, చేతులకు గౌజులు వేసుకోని ఉండటంతో దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని... దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సీసీఎస్ పోలీసులతో సహా ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు .

ఇదీచదవండి

విజయవాడ ఏటీఎం సెంటర్​లో చోరీకి విఫలయత్నం

Last Updated : Sep 15, 2020, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details