BRS hoardings: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తపార్టీ పోస్టర్లు ఏపీలో సైతం వెలిశాయి. బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియచేస్తూ విజయవాడలోని వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటైంది.
బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు.. విజయవాడలో వెలసిన హోర్డింగ్‌లు - విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ వివరాలు
BRS hoardings in Vijayawada: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వేళ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ ఏర్పాటయ్యింది. ఏపీలో బీఆర్ఎస్ హోర్డింగులు ఏర్పాటు కావడంతో వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
BRS hoardings in Vijayawada
హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరుచోట్ల పోస్టర్లు హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి. ఏపీలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇవీ చదవండి: