గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,005 కరోనా కేసులు నమోదు, రెండు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,98,815కు చేరింది. వైరస్ మరణాల సంఖ్య 7,205కు పెరిగింది.
కరోనా కలవరం... ఒక్కరోజే వెయ్యి దాటిన కొవిడ్ కేసులు - news updates in andhrapradhesh
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,005 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 324 మంది కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,86,216కు ఎగబాకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,394 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షలు 1,49,90,039 కు పెరిగాయి.
ఇదీచదవండి.
హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు
Last Updated : Mar 28, 2021, 8:42 PM IST