ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కలవరం: ఒక్క రోజులో 758 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ.. వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 758 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

huge corona cases registered in andhrapradhesh
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

By

Published : Mar 25, 2021, 4:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 758 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,95,879కు చేరింది. మరణాల సంఖ్య 7,201 కి పెరిగింది. వైరస్ నుంచి మరో 231 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు...

చిత్తూరులో అత్యధికంగా 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 127, విశాఖలో 98, కృష్ణాలో 80, అనంతపురంలో 56, తూర్పుగోదావరిలో 45, నెల్లూరులో 33, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 27, కడపలో 24, విజయనగరంలో 23, పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

విద్యార్థుల మధ్య ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details