75వ స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందీరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా దృష్ట్యా సాధారణ ప్రజలకు వేడుకలకు అనుమతి లేదని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించారు.
పంద్రాగస్టు వేడుకలకు ఇందీరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
విజయవాడలోని ఇందీరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్య్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా దృష్ట్యా సాధారణ ప్రజలకు వేడుకలకు అనుమతి లేదని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్ నివాస్
స్టేడియం చుట్టూ జరుగుతున్న భద్రత ఏర్పాట్లను డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. ఈ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశా పోలీసులు కూడా ఒక ప్లాటున్గా పరేడ్లో పాల్గొననున్నారు. నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేసామని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలకు, వీవీఐపీలకు ప్రత్యేక స్థలాలలో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: