ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తోబుట్టువుల క్షేమమే.. 'రాఖీ' పరమార్థం: బాలకృష్ణ - ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ

HERO BALAKRISHNA: అన్నా చెల్లెళ్ల అనురాగానికి చిహ్నం రాఖీ పండుగ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల క్షేమమే రాఖీ పండుగ పరమార్థం అని గుర్తుచేశారు. మహిళాభ్యున్నతికి తోడ్పడటమే మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.

NBK
NBK

By

Published : Aug 11, 2022, 12:31 PM IST

BALAKRISHNA: తోబుట్టువుల క్షేమమే రాఖీ పండుగ పరమార్థమని సినీ హీరో, హిందూపురం​ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి చిహ్నం రాఖీ పర్వదినమని.. తోబుట్టువుల క్షేమం కోరుతూ.. ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటూ రక్షగా నిలిచే పండుగ అని అభివర్ణించారు. అందుకే నందమూరి హీరోల సినిమాలలో తోబుట్టువుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా సందేశం ఉంటుందని బాలయ్య వెల్లడించారు.

ఆడబిడ్డల సంక్షేమం కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పారని స్పష్టం చేశారు. తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, బాలికా విద్యకు ప్రోత్సాహం, ఉపాధికి పెద్దపీట, డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళా సాధికారత మొదలగు వంటివన్నీ ఆడబిడ్డల అభ్యున్నతి కోసమేనన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్​లో కూడా మహిళాభ్యున్నతికి పాటుపడటమే అందరి కర్తవ్యమని తెలిపారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details