16 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును అదాని కంపెనీకి ఎలా కట్టబెడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. గంగవరం పోర్టు వాటాల అమ్మకం వెనుక లాలూచీ ఏంటని ప్రశ్నించారు. 30 ఏళ్ల తర్వాత పోర్టు ప్రభుత్వానికే చెందాలని బీఓటీ ఒప్పందంలో ఉన్నా...దాన్ని ఎలా ఉల్లంఘిస్తారని నిలదీశారు. కార్పొరేట్ కబంధహస్తాల నుంచి పోర్టును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
గంగవరం పోర్టును ఆదాని కంపెనీకి ఎలా కట్టబెడతారు: రామకృష్ణ - Gangavaram Port Latest News
మరో 16 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టును ఆదాని కంపెనీకి ఎలా కట్టబెడతారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.బీవోటీ ఒప్పందం ప్రకారం గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందేలా చూడాలని ఆయన కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Last Updated : Jun 9, 2021, 2:00 AM IST