వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. గర్భవతి కాకున్నా...గర్భవతి అని చెప్పి వైద్యం చేశారు. శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళకు అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి గర్భవతి అని తేల్చారు. దీంతో ఆమె ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన విజయవాడకు వచ్చారు. అనంతరం వైద్యం కోసం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఎలాంటి పరీక్షలు చేయకుండా కొన్ని నెలలుగా మాత్రలు ఇచ్చి పంపించారు. గర్భవతి అని చెప్పి పదినెలలైనా.. నొప్పులు రాకపోవటంతో మహిళకు ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు.
negligence: గర్భవతి అన్నారు..ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తే కణితి అని తేల్చారు ! - ప్రసూతి నిర్ధరణ పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం

ప్రసూతి నిర్ధరణ పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం
16:41 June 21
ప్రసూతి నిర్ధరణ పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం
పరీక్షల్లో మహిళ గర్భవతి కాదని.. ఆమె కడుపులో కణితి ఉందని ప్రైవేటు వైద్యులు తేల్చి చెప్పారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పదినెలలు ఆసుపత్రి చుట్టూ తిప్పుకున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి
Last Updated : Jun 21, 2021, 5:59 PM IST
TAGGED:
hospital mistake