ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు' - honor to lokayuktha justice lakshman reddy

ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే.. ప్రజలు లోకాయుక్తలో ఫిర్యాదు చేయవచ్చని.. విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ పి. లక్ష్మణ్​రెడ్డి అన్నారు.

ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు: లోకాయుక్త

By

Published : Sep 15, 2019, 9:09 AM IST

ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు: లోకాయుక్త

రాజకీయ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేందుకు లోకాయుక్త కృషి చేస్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఆయనను లోకాయుక్తగా నియమించిన సందర్భంగా విజయవాడలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. నగర ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జస్టిస్​ లక్ష్మణ్​రెడ్డిని ఘనంగా సత్కరించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నుకోబడ్డారన్నారు. ప్రజాసేవలో అవినీతి చేసేవాళ్లపై ప్రజలు ఫిర్యాదు చేస్తే లోకాయుక్త తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details