తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీవీ సింధుకు సన్మాన కార్యక్రమం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేత పీవీ సింధును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు వెంకట రమణ, విజయ హాజరయ్యారు.
దేశానికి గర్వకారణం
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.. పీవీ సింధుకు సన్మానం భారతీయులందరూ గర్వపడేలా సింధు చేసిందని మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసించారు. సింధు విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉందని.. అలాంటి అమ్మానాన్నలు ఉండడం తన అదృష్టమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కష్టపడితే విజయం దానంతటదే వస్తుందనీ.. మన రాష్ట్రం నుంచి ఎంతోమంది సింధులు తయారవ్వాలని తాను కోరుకుంటున్నట్లు సింధు తెలిపారు.
ఇవీ చదవండి..
ఈనెల 17 నుంచి జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సులు