తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దోమకొండలో విశ్రాంత ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల అందరూ భయపడి పరుగులు తీశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చిరంజీవి దంపతులు, రాంచరణ్, ఉపాసన వచ్చారు. తేనెటీగలు దాడి చేయడం వల్ల మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. కాసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లివడంతో అంత్యక్రియలు నిర్వహించారు.
తేనెటీగల దాడి..ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ - ఉమాపతిరావు అంత్యక్రియల్లో తేనెటీగల దాడి
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దోమకొండలో కామినేని ఉమాపతిరావు అంత్యక్రియల సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా అందరూ భయపడి పరుగులు తీశారు.
honey-bees-attack-on-umapathi-rao-funeral-in-domakonda