ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హోమియోపతి మందుతో.. కొవిడ్​కు చెక్​..!

By

Published : Sep 4, 2021, 9:54 AM IST

ఆర్సెనికం ఆల్బం మందు కొవిడ్ నిరోధానికి మంచి ఫలితం ఇచ్చినట్లు రాష్ట్ర ఆయుష్ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మూడు జిల్లాల్లో ఎంపిక చేసిన 17 మండలాల్లో ఈ మందును వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

ఆర్సెనికం ఆల్బంతో కొవిడ్ నిరోధం
ఆర్సెనికం ఆల్బంతో కొవిడ్ నిరోధం

కరోనా నివారణకు హోమియోపతిలోని ఆర్సెనికం ఆల్బం-30సి మందు మంచి ఫలితాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఆయుష్‌ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎంపికచేసిన 17 మండలాల్లోని 18 లక్షల మందికి ఈ మందును వలంటీర్ల ద్వారా జూన్‌/జులై నుంచి పంపిణీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె, పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులోని సుమారు 1.60 లక్షల మందికి మందు పంపిణీ అనంతరం కేసుల నమోదు తీరును వైద్య విద్యార్థులు విశ్లేషించారు. మందు పంపిణీ జరిగిన నెల వ్యవధిలో వేలేరుపాడు మండలంలో 65 కేసులు, రేపల్లెలో 53 కేసులు నమోదైనట్లు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు నిర్ధారించారు. మిగిలిన 15 మండలాల్లో అధ్యయనం ముగింపు దశలో ఉంది. రాష్ట్రప్రభుత్వ పర్యవేక్షణలోని ఆరు గురుకుల విద్యాలయాల్లో చదివే సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు ఈ మందును సోమవారం నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details