ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళలపై జరిగే నేరాల విచారణ సమయం బాగా తగ్గింది: హోం మంత్రి - మహిళలపై దాడులపై హోమంత్రి వ్యాఖ్యలు

మహిళలపై జరిగే అకృత్యాలను రాజకీయం చేయవద్దని హోంమంత్రి తానేటి వనిత ప్రతిపక్షాలను కోరారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డ ఆమె.. దిశ చట్టానికి ఇంకా కేంద్ర అనుమతి రావాల్సి ఉందిని చెప్పారు.

మహిళలపై జరిగే నేరాల విచారణ సమయం బాగా తగ్గింది
మహిళలపై జరిగే నేరాల విచారణ సమయం బాగా తగ్గింది

By

Published : May 5, 2022, 7:19 PM IST

ప్రతిపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయని హోమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. మహిళలపై జరిగే అకృత్యాలను రాజకీయం చేయవద్దని కోరుతున్నానన్నారు. మహిళలపై జరిగే నేరాల విచారణ సమయం బాగా తగ్గిందని.., దిశ చట్టానికి ఇంకా కేంద్రం అనుమతి రావాల్సి ఉందిని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు "సైబర్‌మిత్ర" యాప్ తెచ్చామని వెల్లడించారు.

"ప్రతిపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి. మహిళలపై జరిగే అకృత్యాలను రాజకీయం చేయవద్దని కోరుతున్నా. మహిళలపై జరిగే నేరాల విచారణ సమయం బాగా తగ్గింది. దిశ చట్టానికి ఇంకా కేంద్ర అనుమతి రావాల్సి ఉంది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్‌మిత్ర యాప్ తెచ్చాం." - తానేటి వనిత, హోంమంత్రి

దిశ చట్టానికి కేంద్రం అడిగిన క్లారిఫికేషన్ ప్రభుత్వం పంపిందని ఏలూరు డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. కేంద్రం అభ్యంతరాలపై 20 రోజుల క్రితమే ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. చట్టానికి ఉన్న ప్రత్యేకమైన పేరుతోపాటు కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్రానికి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. శాంతిభద్రతలు ఉమ్మడి జాబితాలో ఉండటంతో 'దిశ'పై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని డీఐజీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'రేపల్లె ఘటన'లో జరిగిందిదే.. అత్యాచారం నిందితుల ఉద్దేశ్యం కాదు: హోంమంత్రి

ABOUT THE AUTHOR

...view details