తెలుగుదేశం నేతలు విడుదల చేసిన.. 'ఊరికోఉన్మాది' పుస్తకం ఆ పార్టీ వాళ్లకే వర్తిస్తుందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడ భవానిపురంలోని ఐరన్ హోల్‌సేల్ మార్కెట్‌లో నిర్మించిన రహదారలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఐరన్ హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుగాంచిన భవానిపురం మార్కెట్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తాము అధికారంలోకి రాగానే రూ.5 కోట్ల వ్యయంతో మార్కెట్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశామన్నారు. తమ అభివృద్ధి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని హోంమంత్రి వ్యాఖ్యనించారు.
ఇవీ చూడండి