Home minister fires on Rape issues: అనకాపల్లి చిన్నారి ఘటన, సత్యసాయి జిల్లా పెనుకొండ బీఫార్మసీ విద్యార్థిని ఘటనలపై.. హోంమంత్రి తానేటి వనిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనకాపల్లి ఘటన జరగడంపై హోంమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరు బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ గౌతిమి శాలి తెలపగా.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించం: హోంమంత్రి - ఏపీ వార్తలు
Home minister fires on Rape issues: అనకాపల్లి చిన్నారి ఘటన, సత్యసాయి జిల్లా పెనుకొండ బీఫార్మసీ విద్యార్థిని ఘటనలపై.. హోంమంత్రి తానేటి వనిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనకాపల్లి ఘటన జరగడంపై హోంమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు.
![మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించం: హోంమంత్రి Home minister taneti vanitha talks to police officials over anakapalli and satyasai districts rape incidents](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15208515-215-15208515-1651824277298.jpg)
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించమన్న హోంమంత్రి తానేటి వనిత
సత్యసాయి జిల్లా పెనుకొండ ఘటనలో నిందితుడు సాదిక్‌ను వెంటనే అరెస్ట్ చేసినట్లు.. జిల్లా ఎస్పీ రాజుదేవ్ సింగ్ హోంమంత్రికి తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు హోంమంత్రికి వివరించారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత హెచ్చరించారు.
ఇదీ చదవండి: