ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శాంతి భద్రతలు పరిరక్షిస్తాం: సుచరిత - amaravathi

"శాంతి భద్రతలను పరిరక్షిస్తాం. నిబంధనలను మరింత కఠినతరం చేస్తాం. మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. " అన్నారు హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతొటి సుచరిత. ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

శాంతి భద్రతలు పరిరక్షిస్తాం: సుచరిత

By

Published : Jun 16, 2019, 11:47 AM IST

శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యతని, సమష్టి కృషితో అది సాధ్యమవుతుందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతొటి సుచరిత అన్నారు. అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్​లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత తన ఛాంబర్​లో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వడం జగన్‌ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటని ఆమె అన్నారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే ప్రకటించారని మంత్రి తెలిపారు. దీనిపై కమిటీ వేశామని, నివేదిక వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. పోలీస్‌ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి నాలుగు బెటాలియన్లను మంజూరు చేసిందని తెలిపారు. మహిళ, గిరిజన బెటాలియన్లను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. మహిళలకు సత్వర భద్రత కల్పించేందుకు త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్నేహపూర్వక పోలీసింగ్ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేరాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.

శాంతి భద్రతలు పరిరక్షిస్తాం: సుచరిత

ABOUT THE AUTHOR

...view details