రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులో ఆమె మాట్లాడారు. అమరావతిలో ఉన్న రాజధానిని పూర్తిగా తరలిస్తున్నామని సీఎం ఎక్కడా చెప్పలేదన్నారు.
జనసేనను జనం నమ్మే పరిస్థితి లేదు: హోంమంత్రి - మూడు రాజధానుల నిర్ణయంపై సుచరిత
అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
![జనసేనను జనం నమ్మే పరిస్థితి లేదు: హోంమంత్రి home minister sucharita on capital issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13512152-1002-13512152-1635686889009.jpg)
home minister sucharita on capital issue
ఇక్కడ ఓ ప్రాంతం రాజధానిగా ఉంటుందని చెప్పినప్పటికీ.. పెట్టుబడి దారులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. తెదేపా రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందన్నారు. జనసేన పార్టీ విధివిధానాలు ఎవరికీ అర్ధం కావడం లేదని విమర్శించారు. జనసేనని నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు.