Holidays to HC: ఈ నెల 9 నుంచి జూన్ 10 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 13న కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మొదటి దశలో మే 12, 19, 26 తేదీల్లో, రెండో దశలో జూన్ 2, 9, తేదీల్లో విచారణలు జరగనున్నాయి.
Holidays to HC: ఈ నెల 9 నుంచి జూన్ 10 వరకు హైకోర్టుకు సెలవులు
Holidays to HC: ఈ నెల 9 నుంచి జూన్ 10 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. తిరిగి జూన్ 13 నుంచి కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.
మే9 నుంచి జూన్ 10 వరకు హైకోర్టుకు సెలవులు
మొదటిదశ వెకేషన్ కోర్టుల్లో జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు డివిజన్ బెంచ్‌గా, జస్టిస్ చీమలపాటి రవి సింగిల్ బెంచ్‌గా విచారణలు జరుపుతారు. రెండోదశ వెకేషన్ కోర్టుల్లో జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్ డివిజన్ బెంచ్‌గా, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సింగిల్ బెంచ్‌గా విచారణలు నిర్వహిస్తారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.