ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'షడ్రుచుల సంగమమే జీవితం' తెలుగు ప్రజలకు బాలకృష్ణ ఉగాది శుభాకాంక్షలు - NBK Ugadi Wishes

NBK Ugadi Wishes : తెలుగు ప్రజలకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

NBK Ugadi Wishes
NBK Ugadi Wishes

By

Published : Apr 2, 2022, 2:44 PM IST

NBK Ugadi Wishes : తెలుగు ప్రజలకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగువారి తొలి పండుగని.. షడ్రుచుల సంగమమే జీవితమని తెలిపే పండుగ అని అన్నారు. ఒకటి మధురం, రెండు పులుపు, మూడు లవణము, నాలుగు కారం, ఐదు చేదు, ఆరు వగరు ఈ షడ్రుచులు కలిసిందే మన జీవితమని తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాలు చిగురించాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు బాలయ్య పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details