విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కంచికచర్ల, నందిగామలో రెండేళ్ల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టారు. కంచికచర్ల చెరువు కట్ట వద్ద నుంచి పరిటాల సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఏడు కిలోమీటర్లు రోడ్డు వేయటం పూర్తి కావడంతో వాహనాల రాకపోకలకు పూర్తిస్థాయిలో అనుమతించారు. దీంతో సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్య తీరింది.
కంచికచర్ల వద్ద హైవే బైపాస్ రోడ్డు ప్రారంభం - vijayawada- hyderabad national highway news
విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కంచికచర్ల, నందిగామ వద్ద నిర్మించిన ఆరు వరసల రోడ్డు మార్గంపై వాహనాల రాకపోకలకు అనుమతించారు. దీంతో పండగ సమయంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్య తీరింది.
చిన్నచిన్న నిర్మాణ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. నందిగామ వద్ద 7 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో వన్ వే రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నందిగామ మీదుగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను హైవే బైపాస్ రోడ్డు మీదుగా పంపిస్తున్నారు. నందిగామ వద్ద నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.