విజయవాడ గ్యాంగ్ వార్ నిందితుడు మణికంఠ చికిత్స పొందుతున్న వార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి సంచరించడం గుంటూరు జీజీహెచ్‌లో కలకలం రేపింది. మణికంఠ చికిత్స పొందుతున్న వార్డు వైపు వెళ్లేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించగా... అనుమానం వచ్చిన నర్సు పశ్నించడంతో వెనుదిరిగాడు. సంబంధిత నర్సు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో కలకలం - గుంటూరు క్రైం న్యూస్
విజయవాడ గ్యాంగ్‌వార్ ఘటనలో నిందితుడైన మణికంఠ చికిత్స పొందుతున్న గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో కలకలం రేగింది. నిందితుడి వార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి సంచరించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో కలకలం
పోలీసులు విచారించగా.. ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డు బాయ్ కోసం వచ్చినట్లు అతను తెలిపాడు. నిజంగానే వార్డ్ బాయ్ కోసం వచ్చాడా? లేక... వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మణికంఠ చికిత్స పొందుతున్న వార్డు వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి.