Temperatures: రాష్ట్రంలో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధికంగా విజయవాడలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అనకాపల్లిలో అత్యల్పంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నెల్లూరు 43.98, చిత్తూరు43, తిరుపతి 42.7, కర్నూలు 42.21, అనంతపురం 41.91, కడప 41.4, ప్రకాశం 41.21, శ్రీకాకుళం 38.4, విజయనగరం 38.5, విశాఖపట్నం 39.6, అమలాపురం 40.15, రాజమహేంద్రవరం 39, ఏలూరు 40, భీమవరం 40.4, మచిలీపట్నం 40, గుంటూరు 39.5, నర్సరావుపేట 40, బాపట్ల 38.25, ఒంగోలు 39, నంద్యాల 39.9, తిరుపతి 39.83 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Temperatures: రాష్ట్రంలో భానుడి భగభగలు.. అత్యధికంగా విజయవాడలో నమోదు - విజయవాడ తాజా వార్తలు
Temperatures: రాష్ట్రంలో రోజురోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
రాష్ట్రంలో భానుడి భగభగలు