నీరు-చెట్టు పథకం కింద 2018-19కి పూర్వం జరిగిన పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో నీరు- చెట్టు పథకం కింద 2019కి పూర్వం చేపట్టిన పనులకు రూ.1.46 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ బి.చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనులు జరిగినట్లు ఆమోదం తెలిపారని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
నీరు-చెట్టు పనుల విజిలెన్స్ విచారణపై హైకోర్టు స్టే - నీరు-చెట్టు పనుల విజిలెన్స్ విచారణపై హైకోర్టు స్టే వార్తలు
నీరు-చెట్టు పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన నీరు-చెట్టు పనులకు బిల్లులు ఇవ్వలేదంటూ హైకోర్ట్‌లో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే విధించింది.
పనుల నాణ్యతను ఇంజనీర్లు పరిశీలించి.. రికార్డుల్లో నమోదు చేశారన్నారు. పనులు పూర్తిచేసిన మూడేళ్ల తర్వాత వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో మెమో జారీ చేసిందన్నారు. పిటిషనర్ చేపట్టిన పనులకు బిల్లులను చెల్లించకుండా ఉండేందుకు ఆ మెమోను ఆధారం చేసుకొని విజిలెన్స్ విచారణ పెండింగ్‌లో ఉందని కాలయాపన చేస్తున్నారన్నారు. మెమో అమలును నిలుపుదల చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. మెమో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: వైకాపా సర్కారుపై ధ్వజమెత్తిన తెదేపా నేతలు