2001లో ఆనంద్ సినీ సర్వీసెస్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కేటాయించిన 5ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది పి.రాధీవ్‌రెడ్డి వాదనలు వినిపించారు.
‘‘ఆ సంస్థకు 2001లో 5 ఎకరాలు కేటాయించాం. ఇందులో 1.7 ఎకరాలను వినియోగించుకుంటోంది. మిగిలిన 3.31 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ సీసీఎల్‌ఏ 2014లో ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఆనంద్ సినీ సర్వీసెస్ హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలను పరిశీలించకుండా సింగిల్ జడ్జి భూమిని రిజిస్ట్రేషన్ చేసివ్వాలని ఆదేశించారు. అప్పట్లో చదరపు గజం రూ.1.75కే కేటాయించాం’’ అని వివరించారు.