ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2021, 3:22 AM IST

ETV Bharat / city

HIGH COURT: నీలం సాహ్నిపై పిటిషన్‌లో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

హైకోర్టులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై దాఖలైన వ్యాజ్యంలో విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది.

HIGH COURT
HIGH COURT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నీలం సాహ్నిని ఎస్​ఈసీ(SEC)గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్​ఈసీ(SEC) కాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. ఆమె నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

ABOUT THE AUTHOR

...view details