ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెరువుల ఆక్రమణల సంగతి తేలుస్తాం: హైకోర్టు - చెరువుల ఆక్రమణల సంగతి తేలుస్తామన్న హైకోర్టు

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, సరస్సులు, కుంటలు, నదుల స్థలాల ఆక్రమణల తొలగింపుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలకు సంబం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని సుమోటోగా నమోదు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

high court over encroachment of ponds, lakes in state
చెరువుల ఆక్రమణల సంగతి తేలుస్తాం: హైకోర్టు

By

Published : Jul 9, 2022, 10:38 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, సరస్సులు, కుంటలు, నదుల స్థలాల ఆక్రమణల తొలగింపుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలకు సంబం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని సుమోటోగా నమోదు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాల, పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు. డీఎసి, 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు న్యాయస్థానం నోటీసులు జారీచేసిన వారిలో ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎన్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామ పంచాయతీ పరిధి సర్వే నెంబరు 534 / 1 లోని ప్రభుత్వ భూమిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ.. జి.వెంకటరమణ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను తొలగించాలని ఈ ఏడాది మే 5 న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంపోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి అప్పీల్ చేశారు. ఇటీవల అప్పీల్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. చెరువు పోరంబోకు భూమిలో గ్రామ నచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు చేపట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలు జరిపి నిర్మాణాలు చేశారని, మీరు ఏ విధంగా నిర్మాణాలు చేస్తారని నిలదీసింది. నీటి వనరుల ఆక్రమణలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తేల్చిచెప్పింది . రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల అక్రమణల సంగతిని తెలుస్తామని పేర్కొంటూ ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్ గా మలిచింది. తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సుబేదార్ కుంట / చెరువు అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఆక్రమణలకు గురవుతోందని, ఆ ప్రక్రియను అడ్డుకోవాలని కళ్యాణదుర్గం తెదేపా ఇంచార్జి ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన వ్యాఖ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న కుంటను భారీ వాహనాలతో మట్టితెచ్చి పూడ్చేస్తున్నారని న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు . కొన్ని రోజుల్లో ఆ కుంట కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.

ధర్మాననం స్పందిస్తూ.. ప్రస్తుతానికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనీయండి.. అక్రమణకు గురైనట్లు తేలితే 100 ఎకరాల విస్తీర్ణంలోని చెరువును పూర్వ స్థితికి తెచ్చేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పింది. ఆందోళన చెందవద్దని తెలిపింది.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details