కన్వీనర్ కోటాలో మెడికల్ పీజీ ప్రవేశాలు పొందినవారిని యాజమాన్య కోటాలో అనుమతించట్లేదని చింతా మౌనిక అనే విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశం పొందాలంటే కన్వీనర్ కోటాలో సీటు వదులుకోవాలని పెట్టిన నిబంధనపై హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. యాజమాన్య కోటాలో అనుమతించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. యాజమాన్య కోటాలో సీట్లు ఇవ్వకూడదనే దురుద్దేశంతోనే యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం చేసిందని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతానికి పిటిషనర్‌ని మేనేజ్మెంట్ కోటాలో కౌన్సెలింగ్‌కు అనుమతించాల్సిందిగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.
'ఆ విద్యార్థినికి యాజమాన్య కోటాలో కౌన్సెలింగ్'.. ఎన్టీఆర్ వర్సిటీకి హైకోర్టు ఆదేశాలు - ఎన్టీఆర్ వర్సటీకి హైకోర్టు ఆదేశాలు
కన్వీనర్ కోటాలో ప్రవేశం పొందిన మెడికల్ పీజీ విద్యార్థులను యాజమాన్య కోటాలో అనుమతించట్లేదని ఓ విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌ను యాజమాన్య కోటాలో కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.

ఎన్టీఆర్ వర్సటీకి హైకోర్టు ఆదేశాలు