విజయవాడలోని బెంజ్ సర్కిల్‌పై వంతెనలకు ఇరువైపుల పది మీటర్లతో సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథార్ట్ ఆఫ్ ఇండియా, సబ్ కలెక్టర్, భూసేకరణ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. సర్వీసు రోడ్డు ఏర్పాటు బాధ్యత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోనిదేనని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం ముఖ్యమని చెప్పింది. ఇలాంటి వ్యవహారాల్లో వివాదాలకు తావులేకుండా ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని హితవు పలికింది. మొదటి పైవంతెనకు తూర్పు వైపు 10 మీటర్లతో సర్వీసు రోడ్డు వేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది.
Benz circle road: విజయవాడ బెంజ్ సర్కిల్ పైవంతెన ఇరువైపులా రోడ్లు వేయండి: హైకోర్టు
21:20 September 04
బెంజ్ సర్కిల్ పైవంతెన ఇరువైపులా రోడ్లు వేయాలని హైకోర్టు ఆదేశం
పకీర్ గూడెం కూడలి వద్ద అండర్‌పాస్‌ను ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అండర్ పాస్ ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానిక కాలనీవాసులకు అసౌకర్యం కలగడం వాస్తవం అయినప్పటికీ .. సాంకేతిక కారణాలతో సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ చెబుతోందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఎన్హెచ్ఏఐకి వదిలేస్తూ సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పును సమర్థించింది. బెంజ్ సర్కిల్ వద్ద ఇప్పటికే నిర్మించిన మొదటి పైవంతెన, ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో పైవంతెనల వద్ద సర్వీసు రోడ్డులు ఏర్పాటు వివాదంపై ప్రజాహిత వ్యాజ్యం, మరో రెండు అప్పీళ్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది. మూడు నెలల సమయం సరిపోదని.. ఎక్కువ రోజులు ఇవ్వాలని ఎన్ఏఐ తరపు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ముందు పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. సమయం చాలకపోతే తర్వాత దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి.. మొదటి పైవంతనకు తూర్పువైపు 110 మీటర్ల సర్వీసు రోడ్డును ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ తమ్మారెడ్డి రమేశ్ మరో 9 మంది 2019 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పది మీటర్ల సర్వీసు రోడ్డు నిర్మిచాలని అధికారులను ఆదేశించారు
ఇదీ చదవండి
Mining Privatization :'మైనింగ్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన'