ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జనసేన పార్టీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ

By

Published : Mar 8, 2021, 3:28 PM IST

Updated : Mar 8, 2021, 5:13 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జనసేన పార్టీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

గత ఏడాది జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్​కు.. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల కమిషనర్​ను​ ఆదేశించాలని జనసేన కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. తీవ్ర అడ్డంకులు, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని పేర్కొన్నారు. అప్పుడు నామినేషన్ వేయలేకపోయిన వారు, వేధింపుల కారణంగా ఉపసంహరించుకున్న వారు అందజేసిన వివరాల్ని పరిగణనలోకి తీసుకుని.. కలెక్టర్​లు నివేదికలు ఇవ్వాలంటూ ఫిబ్రవరి 18న ఎస్​ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఏకగ్రీవాల్లో ఫామ్ 10 ఇచ్చినచోట విచారణ జరపవద్దని..,విచారిస్తే ఫలితాలు వెల్లడించవద్దని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. పిటిషన్​పై ఇవాళ వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

Last Updated : Mar 8, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details