ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Schools re-open: టీచర్లకు టీకాలు ఇచ్చాకే బడులు తెరవాలని పిటిషన్‌.. హైకోర్టులో విచారణ - టీచర్లకు టీకాలు ఇచ్చాకే బడులు తెరవాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

టీచర్లకు టీకాలు ఇచ్చాకే బడులు తెరవాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని పిటిషనర్ తెలపగా.. 85 శాతం మందికి టీకాలు ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు.

High Court on the petition to open the schools where teachers are vaccinated
టీచర్లకు టీకాలు ఇచ్చాకే బడులు తెరవాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

By

Published : Aug 12, 2021, 4:34 PM IST

Updated : Aug 12, 2021, 11:44 PM IST

ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన సిబ్బందికి ఇచ్చిన టీకా వివరాలను హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 2 లక్షల83 వేల 303 మంది ఉండగా 69 వేల 618 మందికి ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదని.. 1 లక్షా 34 వేల 480 మంది టీకా తీసుకున్నారని, వారిలో 70 వేల 215 మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారని తెలిపింది. బోధనేతర సిబ్బంది 56436 మంది ఉండగా, 20397 మందికి ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదని, 20052 మంది ఒక్కడోసు, 15377 మందికి రెండు డోసులు పూర్తి అయ్యిందని ప్రభుత్వం తెలిపింది.

ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ చేస్తున్న ఆరోపణ నిరాధారమైందని వెల్లడించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజ శేఖర్ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిదిలోని బోధన, బోధనేతర సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పరిగణించి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శికి మే 13, జులై 3న విజ్ఞప్తి చేశామని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించి అందరు జిల్లా వైద్యారోగ్య అధికారులకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తగిన అదేశాలిచ్చిందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు పునఃప్రారంభించడానికి ముందే ఉపాధ్యాయులందరికి కోవిడ్‌ టీకా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఉమాశంకర్ దాఖలు చేసిన పిల్​పై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఎస్‌జీపీ సుమన్ వాదనలు వినిపిస్తూ .. తాజా వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడుస్తాయని మంత్రి వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులందరికి దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగట్లేదని.. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్ తరగతులు వద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

SCHOOLS REOPEN: ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Last Updated : Aug 12, 2021, 11:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details