విద్యుత్ యూనిట్ టారిఫ్ ధరలను పునఃసమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థల తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు సింగిల్ జడ్జి సైతం సమీక్ష వ్యవహారం ఏపీఈఆర్సీకి వదిలేశారన్నారు. పూర్తిస్థాయి వాదనలకు సమయం లేకపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని యూనిట్ టారిఫ్ ధరలను ఏపీఈఆర్సీ సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. తాజాగా విచారణలో డిస్కంల తరఫున పేజీ వాదనలు వినిపించారు.