ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC ON SOCIAL MEDIA: న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా? - HIGH COURT LATEST NEWS

HC ON SOCIAL MEDIA: న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే..... ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది . ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం , సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం , వీడియోలు అప్లోడ్ చేయడాన్ని ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది . హైకోర్టు న్యాయమూర్తులు , న్యాయవ్యవస్థను అపకీర్తి పాలుజేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్లోడ్ చేయడంపై నమోదు చేసిన కేసులో. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ల పై ధర్మాసనం విచారణ జరిపింది .

న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా?
న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా?

By

Published : Feb 18, 2022, 3:36 AM IST


HC ON SOCIAL MEDIA: న్యాయవ్యవస్థపై , న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు , పోస్టులను అసలు సహించబోమని హైకోర్టు తేల్చిచెప్పింది . న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజల్లోనూ ఆ భావన కొనసాగుతుందని వ్యాఖ్యానించింది . న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే..... ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని నిలదీసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు , మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి , సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ జి .రమేశ్ కుమార్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు ఆఫీసర్లుగా ఉంటూ న్యాయస్థానాల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటంపై అభ్యంతరం తెలిపింది. నిందితులను దిగువ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చినందున విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


న్యాయవాది చంద్రశేఖరరావు , సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జి .రమేశ్ కుమార్‌ పోలీసు కస్టడీ శుక్రవారం ఉదయం 10న్నర గంటలకు ముగియనుంది. అనారోగ్యం కారణంగా మరో నిందితుడు గోపాలకృష్ణ కళానిధి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు . నిందితులు పోలీసు కస్టడీ పూర్తయ్యాక కూడా జ్యుడీషియల్ రిమాండ్ ఉండాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. మూడు వ్యాజ్యాలపై విచారణను ఈనెల 21 కి వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈమేరకు ఆదేశాలిచ్చారు . హైకోర్టు న్యాయమూర్తులు , న్యాయవ్యవస్థను అపకీర్తి పాలుజేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం , వీడియోలు అప్లోడ్ చేయడంపై నమోదు చేసిన కేసులో న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు , గోపాలకృష్ణ కళానిధి , సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ రమేశ్ కుమార్లను సీబీఐ అరెస్ట్ చేసింది. బెయిలు కోసం వారు హైకోర్టులో పిటిషన్లు వేశారు . సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి , హేమేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది డి . కోదండరామిరెడ్డి నిందితుల తరపున వాదనలు వినిపించారు . న్యాయవాదులిద్దరిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టుధిక్కరణ కేసులో క్షమాపణలు కోరారని, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారని తెలిపారు . దీంతో వారి ఇద్దరిపై ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసును మూసేసిందన్నారు . న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపడుతున్నారన్నారు . సీబీఐ నమోదు చేసిన పలు సెక్షన్లు పిటిషనర్ల వ్యాఖ్యలకు వర్తించవన్నారు . అనారోగ్యంతో బాధపడుతున్నారని..... బెయిలు మంజూరు చేయాలని కోరారు.


సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ .. హైకోర్టు జడ్జీలపై పిటిషనర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు . రాజకీయ కోణం ఆపాదించారన్నారు . దిగువ కోర్టు రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చిందన్నారు . ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దన్నారు . ఓ వైపు దిగువ కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చి విచారణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హైకోర్టు బెయిలు మంజూరు చేయడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:

వనం నుంచి జనంలోకి.. మేడారం గద్దెల మీదకు సమ్మక్క..

ABOUT THE AUTHOR

...view details