ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలతో భర్తీ చేసే ప్రక్రియపై.. 2010 డిసెంబర్ 13న హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని న్యాయవాది తాండవ యోగేష్ అభ్యర్థించారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1) (సి) ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలతో 25 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈమేరకు 2010 జులై 30న ప్రభుత్వం తెచ్చిన జీవో 44ను సవాలు చేస్తూ ఓ విద్యాసంస్థ వేసిన వ్యాజ్యంలో.. హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి స్టే ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో.. ఏటా లక్షల మంది పేద పిల్లలు నష్టపోతున్నారని వివరించారు. ఈ ఏడాది పాఠశాల ప్రవేశాలు ప్రారంభం కానున్నందున.. స్టే ఎత్తివేయాలని కోరారు. దీనిపై ఇవాళ విచారణ జరుపుతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే.గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్య ధర్మాసనం తెలిపింది.
PRIVATE SCHOOLS: గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేతపై నేడు విచారణ - vijayawada news
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలతో భర్తీ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేత పిటిషన్పై నేడు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
PRIVATE SCHOOLS