పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరపాలని అప్పీళ్లు దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హైకోర్టులో 5 అనుబంధ పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ ఈ నెల 27కి వాయిదా వేసినట్లు వ్యాఖ్యానించింది. దీంతో ప్రస్తుత పిటిషన్‌లు కూడా అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పోటీచేసిన వారిని అప్పీళ్లు దాఖలు చేసేందుకు అనుమతిస్తే ఎంత మంది వేస్తారో తెలీదని.. వారందరూ వేసే అప్పీళ్లను విచారించడం సాధ్యం కాదని ఈ మేరకు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పీళ్లను అనుమతించాలా ? లేదా ? అనే విషయాన్ని ఈ నెల 27న జరిగే విచారణలో నిర్ణయిస్తామని పేర్కొంది.
అప్పీళ్లు వేసేందుకు అనుమతించండి: పరిషత్ ఎన్నికల అభ్యర్థులు - హైకోర్టు
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరపాలని అప్పీళ్లు దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హైకోర్టులో 5 అనుబంధ పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ ఈ నెల 27కి వాయిదా వేసినట్లు వ్యాఖ్యానించింది.
పరిషత్ ఎన్నికల అభ్యర్థులు