శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి వివాదం అంశంలో ధార్మిక పరిషత్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని దేవాదాయ శాఖను హైకోర్టు ఆదేశించింది. మఠాధిపతిగా తమను గుర్తించాలని.. దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ.. మఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి రెండో భార్య , ఆమె కుమారుడు దాఖలు చేసిన వ్యాజ్యాలపై కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తమను మఠాధిపతులుగా విధులు నిర్వహించకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. అయితే ధార్మిక పరిషత్ చేసిన తీర్మానం మేరకు సభ్య కార్యదర్శి హోదాలో ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చామని.. దేవదాయ శాఖ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
బ్రహ్మంగారి మఠం: పీఠాధిపతి వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి అంశంలో రెండో భార్య కోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం దానిపై వాదనలు విని.. సోమవారానికి వాయిదా వేసింది. దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను కోర్టు తేల్చనుంది.
పీఠాధిపతి వ్యాజ్యం విచారణ సోమవారానికి వాయిదా