విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ కోర్టు కాంప్లెక్స్ భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ పరిశీలించారు. పనులు ఏ దశలో ఉన్నాయంటూ.. న్యాయమూర్తి పరిశీలన చేశారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలను న్యాయాధికారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.
కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతుందని.. ఈ క్రమంలో విచారణ ప్రత్యక్షంగానే కాకుండా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నిర్వహించేందుకు అనువైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీర్లకు సూచించారు. మొత్తం జీ ప్లస్ ఎనిమిది ఫ్లోర్లుగా భవన నిర్మాణం జరగనుంది.