ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ఐఏఎస్ అధికారుల అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ - ఐఏఎస్ అధికారుల అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఐఏఎస్ అధికారులు బి.రామారావు, కె.ప్రవీణ్ కుమార్​ మీద దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ అధికారుల అరెస్ట్‌కు‌ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.

high court
ఐఏఎస్ అధికారుల అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్

By

Published : Mar 6, 2021, 7:36 AM IST

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఐఏఎస్ అధికారులు బి.రామారావు, కె.ప్రవీణ్ కుమార్ అరెస్ట్‌కు‌ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఈనెల 19లోపు వారిని హాజరుపరచాలని విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు ఎస్పీలను ధర్మాసనం ఆదేశించింది. విజయనగరం జిల్లా పరిధిలోని ఓబీసీ బాలుర వసతి గృహం ఉద్యోగి జి.చంద్రమౌళికి పదోన్నతి ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గతంలో కోర్టు ఉత్తర్వులిచ్చింది.

ఆ ఆదేశాలు అమలుచేయకపోవడంపై చంద్రమౌళి.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. శుక్రవారం జరిగిన విచారణలో తదుపరి విచారణకు హాజరుకావాలని రాష్ట్ర‌ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రామారావు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ను ధర్మాసనం ఆదేశించింది. వారిద్దరు గైర్హాజరు కావడంతో న్యాయమూర్తి.. వారిపై నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేశారు. ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహార్‌లాల్, విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి ఏప్రిల్ 6న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details