న్యాయ నగరానికి భూమిపూజ...! - చంద్రబాబు
అమరావతిలో శాశ్వత హైకోర్టు భవనానికి భూమి పూజ, శంకుస్థాపన సీజేఐ, ముఖ్యమంత్రి చంద్రబాబు.
హైకోర్టు భవనానికి శంకుస్థాపన
అమరావతిలో 450 ఎకరాల్లో బౌద్ధ స్తూపాకృతిలో నిర్మితం కానున్న న్యాయనగరానికి సీజేఐ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. శాశ్వత హైకోర్టు నిర్మాణానికి జస్టిస్ రంజన్ గొగోయ్ శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. అనంతరం హైకోర్టు భవనం శంకుస్థాపన స్థలం వద్ద గ్యాలరీ వీక్షిస్తారు.రూ.819కోట్లతో12.2లక్షల చదరపు అడుగుల్లోహైకోర్టు భవనం నిర్మితమవుతోంది.