ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Dairy: ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించటంపై హైకోర్టులో విచారణ

ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించటంపై హైకోర్టులో విచారణ జరిగింది. డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదలాయిస్తూ ఏపీ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘరామ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అమూల్ డెయిరీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులు న్యాయస్థానంలో కౌంటర్లు దాఖలు చేశాయి.

High Court hearing on transfer of AP Dairy assets to Amul
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించటంపై హైకోర్టులో విచారణ

By

Published : Jul 5, 2021, 5:04 PM IST

Updated : Jul 6, 2021, 6:39 AM IST

అమూల్ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన సొమ్ము ఖర్చు చేయవద్దని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు , అమూల్ డెయిరీ దాఖలు చేసిన కౌంటర్లుకు తిరుగు సమాధానంగా కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్​మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించే నిమిత్తం ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిల్ వేశారు. మంత్రివర్గ నిర్ణయాన్ని చట్ట , రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. అమూల్ కోసం ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేయవద్దని ప్రభుత్వాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ఈ వ్యాజ్యంలో తాము కౌంటర్లు వేశామని ఎన్ డీడీబి, అమూల్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందుతున్నామని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుకొని తాము వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని పాల ఉత్పత్తిదారులు మూడు అనుబంధ పిటిషన్లు వేశారు. న్యాయస్థానం వాటిని స్వీకరించేందుకు తమకు అభ్యంతరం లేదని ఎంపీ తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయస్థానం అనుమతించింది.

Last Updated : Jul 6, 2021, 6:39 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details