ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ.. గడువు కోరిన ఎస్​ఈసీ - రేషన్ పంపిణీపై హైకోర్టులో విచారణ వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీపై విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందా? లేదా? చెప్పేందుకు సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును కోరింది. పంచాయతీ ఎన్నికల సమయంలో రేషన్‌ పంపిణీ వాహనాలపై ఎస్​ఈసీ అభ్యంతరం తెలిపింది.ొ

ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ
ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ

By

Published : Feb 25, 2021, 4:44 AM IST

పంచాయతీ ఎన్నికల సమయంలో రేషన్‌ పంపిణీ వాహనాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా.. మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీకి వీలుగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. దీన్ని ధర్మాసనం ముందు ఎస్​ఈసీ సవాల్ చేసింది. ఈ అప్పీలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవహారంపై చర్చించి ఆ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ఎస్​ఈసీ కోరింది. ఈ అభ్యర్థన మేరకు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details