SAMINENIO UDAYABHANU: వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సామాజికవేత్త కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసు.. విచారణ 21కి వాయిదా - వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసును వాయిదా వేసిన హైకోర్టు
SAMINENIO UDAYABHANU: వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న క్రిమినల్ కేసులను వెనక్కి తీసుకోవడంపై దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించగా.. సమయం కావాలని కోరడంతో తదపరి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.
ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
బుధవారం ఈ పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కేసుల ఉపసంహరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులు సమయం కోరారు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:Suspension: యువకుడి ఆత్మహత్య కేసు.. సీఐపై సస్పెన్షన్ వేటు !