ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని వ్యాజ్యాల విచారణ ప్రత్యక్ష ప్రసారం కేసు..కౌంటర్​ దాఖలుకు హైకోర్టు ఆదేశం - ప్రత్యక్ష ప్రసారం వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

రాజదాని వ్యాజ్యాల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైలన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​ను ధర్మాసనం ఆదేశించింది.

hc on Amaravati Rajdhani case
ప్రత్యక్ష ప్రసారం వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

By

Published : Feb 4, 2021, 1:06 AM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ దాఖలైన వాజ్యంపై.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. రాజధాని వ్యాజ్యాల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆదేశాలివ్వాలని విజయవాడకు చెందిన వేమూరు లీలాకృష్ణ..... పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన సదుపాయాలు.. హైకోర్టులో ఉన్నాయో లేదో తెలుసుకున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.ఈ వ్యాజ్యాల్లోనే ప్రత్యక్షప్రసారం ఎందుకుకోరుతున్నారని ప్రశ్నించింది. తమ ముందున్న అన్ని వ్యాజ్యాలు ముఖ్యమేనని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. రిజిస్ట్రార్ జనరల్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు..తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details