AVB case in High Court: నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో పలు ఆరోపణలతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్‌పై కేసు నమోదు చేసి ఏడాదిపైనే గడిచిందని పిటిషనర్ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దురుద్దేశంతో కేసు నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
'ఏబీవీ కేసు దర్యాప్తు వివరాలు సమర్పించండి'.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ఏబీవీ కేసు దర్యాప్తు వివరాలు ఇవ్వాలు సమర్పించండి
High Court: భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో పలు ఆరోపణలతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం..కేసు దర్యాప్తు స్టేటస్‌ను తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
వాదనలు విన్న న్యాయస్థానం..కేసు దర్యాప్తు స్టేటస్‌ను తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాల సమయం కోరగా.. ధర్మాసనం రెండు వారాల సమయమిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి
TAGGED:
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం