High Court: వివేకానంద హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, మరో నిందితుడు సునీల్‌యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత కోరింది. నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనల కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసు విచారణ.. తనను ప్రతివాదిగా చేర్చాలన్న వివేకా కుమార్తె
High Court: వివేకానంద హత్య కేసులో నిందితులు వేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. శివశంకర్‌రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత కోరింది.
వివేకా హత్య కేసులో హైకోర్టు విచారణ